![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -46 లో.....సూపర్ మార్కెట్ ని బంద్ చేసి రుద్రని డెవలప్ కాకుండా చెయ్యాలని వీరు ప్లాన్ చేస్తాడు. కానీ రుద్ర ముందే సమస్యని పసిగట్టి పరిష్కరిస్తాడు. ఇక వినాయకుడి విగ్రహలు రావడం లేట్ అయ్యేలా వీరు చేస్తాడు. కానీ గంగ మట్టితో విగ్రహాలని రెడీ చేస్తుంది.
గంగ వంక రుద్ర అలానే చూస్తుంటాడు. రుద్ర గాడిని దెబ్బ కొట్టాలంటే అన్నీ అడ్డంకులే ఈ గంగ వల్ల మొత్తం చెడిపోయింది.. రుద్రకి గంగ తోడైతే ఏం చెయ్యలేమని వీరు అనుకుంటాడు. అప్పుడే వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. అనుకున్నది ఏం జరగడం లేదని ఇషికతో వీరు అంటాడు. ఆ గంగకి ఆ దేవుడి సపోర్ట్ ఉందేమో... అందుకే ఏం చెయ్యలేకపోతున్నామని ఇషిక అంటుంది.
ఆ తర్వాత ఆ దేవుడినే మాయం చేస్తే అని వీరు అనగానే ఏం అంటున్నావ్ బ్రో అని ఇషిక షాక్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం ఇందుమతి హాల్లోకి వస్తుంది. వినాయకుడి విగ్రహం అక్కడ ఉండదు.. దాంతో తను షాక్ అయి అందరిని పిలుస్తుంది. ఆ విషయం ఇందుమతి చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. వినయకుడి విగ్రహం కన్పించకపోవడం ఏంటని ఇంట్లో అందరు అనుకుంటారు. అప్పుడే గంగ వస్తుంది. విషయం తెలిసి షాక్ అవుతుంది. అసలు వినాయకుడి విగ్రహం ఎవరు తీశారు.. వీరూనే తీసి ఉంటాడా.. తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |